తెలంగాణ

telangana

ETV Bharat / state

'పస్తులుంటోన్న వారి ఆకలి తీర్చడమే లక్ష్యం' - కరోనా సంక్షోభంలో పేదల కష్టాలు

దానాల్లో కెల్ల అన్నదానం గొప్పది అంటారు. స్వార్థంతో ఎవరి దారి వారే చూసుకుంటోన్న ప్రస్తుత కాలంలో.. ఆకలితో అలమటించే పేదలకు నిస్వార్థంగా సాయపడే వారూ ఉన్నారు. ఆ కోవకే చెందుతుందీ హైదరాబాద్​కు చెందిన ఆహార్ సేవా సంస్థ. నిరుపేదల ఆకలి తీరుస్తూ, వారి అవసరాలను గుర్తిస్తూ సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతోంది. సంక్షోభంలో సాటి వారికి సాయం చేయడం తమకెంతో సంతృప్తినిస్తోందంటోంది.

hunger of the poor in lockdown
లాక్​డౌన్​లో పేదల కష్టాలు

By

Published : May 16, 2021, 4:38 PM IST

లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అల్లాడుతోన్న వారికి 'ఆహార్ సేవా సంస్థ' సభ్యులు.. అల్పాహారం, భోజనం అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు. పాతబస్తీ, పేట్లబుర్జు ప్రభుత్వాసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రి, పబ్లిక్ గార్డెన్‌తో పాటు పలు ప్రాంతాల్లో.. పేదల ఆకలిని తీరుస్తున్నారు.

పేదల ఆకలి తీరుస్తోన్న మానవతావాదులు..

సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయి పస్తులుంటోన్న వారి ఆకలి తీర్చడమే తమ లక్ష్యమంటున్నారు సంస్థ నిర్వాహకులు. గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు 2 వేల మందికి అల్పాహారం, భోజనాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకలితో బాధపడేవారికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. గతేడాది లాక్​డౌన్ ​లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలంతా మాస్క్​ తప్పనిసరిగా ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: విపత్తు వేళ కామ్రేడ్‌ల అండ..!

ABOUT THE AUTHOR

...view details