తెలంగాణ

telangana

ETV Bharat / state

Rush in Temples: వనస్థలిపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కిటకిట - భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

Rush in Temples: భాగ్యనగరంలో వేకువజాము నుంచే నూతన సంవత్సర శోభ సంతరించుకుంది. పలు ఆలయాల్లో దైవ దర్శనానికి భక్తులు తరలివచ్చారు. వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Rush in Temples: నూతన సంవత్సరం వేళ..  భాగ్యనగరంలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
Rush in Temples: నూతన సంవత్సరం వేళ.. భాగ్యనగరంలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

By

Published : Jan 1, 2022, 3:57 PM IST

Rush in Temples: నూతన సంవత్సరం వేళ.. భాగ్యనగరంలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

Rush in Temples: నూతన సంవత్సరం తొలి రోజున హైదరాబాద్​లో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఆలయాల్లో భక్తులతో సందడి నెలకొంది. వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త ఏడాది కలిసిరావాలని కలి దోషాలు పోవాలని ఆ కలియుగ దైవాన్ని భక్తులు ప్రార్థించారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ కమిటీ ఛైర్మన్ లక్ష్మయ్య తెలిపారు.

'నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాం. ఆలయంలో నిత్యపూజలు, హోమాలు, నిత్యాన్నదానాలు చేపడుతున్నాం. భక్తుల కోసం శానిటైజేషన్​ కూడా చేపడుతున్నాం. భగవంతుని ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం.' -కె.లక్ష్మయ్య, ఆలయ కమిటీ ఛైర్మన్​

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details