తెలంగాణ

telangana

ETV Bharat / state

Golconda Bonalu: గోల్కొండ కోటలో బోనాల సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు - గోల్కొండ బోనాల సందడి

Golconda Bonalu: నగరంలో బోనాల సందడి మొదలైంది. ఇవాళ మొదటి ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Golconda Bonalu
గోల్కొండ కోటలో బోనాల సందడి

By

Published : Jul 3, 2022, 4:05 PM IST

Updated : Jul 3, 2022, 4:59 PM IST

Golconda Bonalu: గోల్కొండ కోటలో బోనాల సందడి షురూ అయింది. మొదటి ఆదివారం కావడంతో భక్తుల పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు 20 వేల మందికు పైగా భక్తులు వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. అయితే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

గోల్కొండ కోటలో బోనాల సందడి.. భారీగా తరలివచ్చిన భక్తులు

భక్తుల రద్దీకి అనుగుణగా జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ అధికారులు అన్ని విభాగాలతో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో పెద్ద ఎత్తున బోనాలకు నిధులు కేటాయించడంతో అన్ని శాఖలతో సమకూర్చి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గోల్కొండ కోట భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Last Updated : Jul 3, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details