మూడునెలలకు పైగా వెలవెలబోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎట్టకేలకు కళను సంతరించుకున్నాయి. పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు
పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యాలయాలు సందడిగా మారాయి. హైదరాబాద్‌లోని కూకట్పల్లి, మూసాపేట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు
హైదరాబాద్‌లోని కూకట్పల్లి, మూసాపేట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం నుంచే సందడిని తలపించాయి. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఇచ్చిన సమయంలోనే అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.