రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వైన్ షాపుల వద్ద మందుబాబుల తాకిడి పెరిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు దుకాణాల వద్ద రద్దీ పెరగడంతో పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు.
మద్యం దుకాణాలకు పోటెత్తిన మందుబాబులు - దుకాణాల వద్ద రద్దీ
లాక్ డౌన్ ప్రకటించడంతో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పోటెత్తారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వైన్‌షాపులు సందడిగా మారాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రద్దీ పెరగడంతో పోలీసులే దగ్గరుండి పర్యవేక్షించారు.
మద్యం కోసం బారులు తీరిన యువకులు
మాదాపూర్, హైటెక్ సిటీలోని వైన్ షాపుల వద్ద పలువురు యువతీ, యువకులు మద్యాన్ని కొనుగోలు చేశారు. దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు రహదారిపై వాహనాల రాకపోకలను నియంత్రించగా... వైన్ షాపుల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మాస్కు, భౌతిక దూరం పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో 10 రోజులకు సరిపడ మద్యాన్ని కొనుగోలు దారులు తీసుకెళ్లారు.