Huge Amount of Money Seized in Telangana పాత రికార్డులన్నీ ఢమాల్.. పోలీసుల తనిఖీల్లో 243 కోట్ల సొమ్ము స్వాధీనం Huge Amount of Money Seized in Telangana 2023 :రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం పట్టుబడుతోంది. హైదరాబాద్ సైఫాబాద్‌లో పోలీసుల తనిఖీల్లో రూ. 10 కోట్ల విలువైన 13.5 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వైపు వెళ్తున్న మార్గంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Police Checking in Telangana Election Code 2023 :నారాయణగూడలో నిర్వహించిన వాహన తనిఖీల్లో.. రూ. 11 లక్షల 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సెమీటరీ ఎక్స్‌రోడ్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్‌లో.. పెద్ద మొత్తంలో 500 నోట్లు గుర్తించారు. చైతన్యపురి వద్ద పోలీసుల తనిఖీల్లో.. రూ. 97 లక్షల 16 వేలు నగదును ఎస్వోటీ పోలీసులు సీజ్ చేసి..స్థానిక పోలీసులకు అప్పగించారు. మాదాపూర్ చౌరస్తాలో కారులో తరలిస్తున్న రూ. 27 లక్షల 35 వేల నగదును పోలీసులు జప్తు చేశారు.
నల్గొండ నకిరేకల్‌లో వాహనాల తనిఖీల్లో.. రూ. 5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో రూ. 243 కోట్ల విలువైన సొత్తును పోలీసులు జప్తు చేశారు. 2018 ఎన్నికల సందర్భంగా మెుత్తంగా 103 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా.. ఈ సారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపునకు పైగా పట్టుకున్నారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 83 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112 క్యారట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో 7 లక్షల 91వేల 720 నగదును సీజ్ చేసినట్లు.. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
2 Crore Money Seize in Karimnagar : కరీంనగర్లో రూ.2.36 కోట్లు సీజ్
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో.. హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో సమావేశమైన ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్.. ఎన్నికల నిబంధనలను వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిజిటల్ లావాదేవీలు, లెక్కకు మించిన నగదు ఉన్న ఖాతాలపై నిఘాపెట్టాలని సూచించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని.. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల నోడల్ ఆఫీసర్‌కు పంపించాలని ఆదేశించారు.
Telangana assembly Elections 2023 :ఏటీఎమ్‌లలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వాహనాలు, ఆయా బ్యాంకులకు తప్పనిసరిగా జీపీఎస్‌ను ఏర్పాటుచేసి వాహనాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలు లక్షకు మించిన లావాదేవీలు చేస్తే సమాచారం అందించాలని రోనాల్డ్ రోస్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనాలపై విమర్శలు వెల్లువెత్తుడంటంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రెవెన్యూ, ఖజానా, ఆదాయపు పన్ను అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.. బాధితులు సరైన అధారాలు సమర్పించి తిరిగి తమ సొమ్మును స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. తనిఖీల్లో పట్టుబడిన నగదు 10 లక్షలలోపు ఉండి.. సరైన ఆధారాలు చూపిస్తే 48 గంటల్లో మొత్తం సొమ్మును పోలీసులు వెనక్కి ఇచ్చేస్తారని స్పష్టంచేసింది.
Police Seize 17 KG Gold in Miyapur : మియాపూర్‌లో 17 కిలోల బంగారం, కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం
Telangana Police Seized RS 3 Crores in Nalgonda : ఎన్నికల ఎఫెక్ట్.. వాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద రూ.3 కోట్లు సీజ్.. మరో చోట రూ.6 లక్షలు