How to Pay HMWSSB Water Bill in Hyderabad by Online: మీరు భాగ్యనగర వాసులా..? మీరు వాటర్ బిల్లును చెల్లించడానికి అవస్థలు పడుతున్నారా..? ఇప్పుడు నో టెన్షన్! హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB).. మీ నీటి బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించడాన్ని గతంలో కంటే సులభతరం చేసింది. ఇకపై లైన్‌లో వేచి ఉండటం లేదా గడువు తేదీని మర్చిపోయి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. HMWSSB అధికారిక పోర్టల్, Amazon Pay, Payrup App, TalkCharge మొదలైన వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లను ఉపయోగించి హైదరాబాద్‌లో నీటి బిల్లును చెల్లించవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
HMWSSB వాటర్ బిల్ ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?
How To Pay HMWSSB Water Bill in Online?
- హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారిక వెబ్‌సైట్ https://www.hyderabadwater.gov.in/ లోనికి వెళ్లండి.
- హోమ్‌పేజీలో Services ట్యాబ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. కస్టమర్ సర్వీసెస్ ఆప్షన్లో.. Pay Your Bill Onlineపై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో.. చెల్లించడానికి తగిన లింక్‌ను (Bill Desk లేదా Official Govt Wallet)క్లిక్ చేయండి.
- మీరు అధికారిక ప్రభుత్వ వాలెట్‌ని ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Request for Bill ఆప్షన్‌పై”క్లిక్ చేయాలి.
- అనంతరం స్క్రీన్‌పై నీటి బిల్లు వివరాలు కనిపిస్తాయి.. వాటిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
- చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింటవుట్ తీసుకోండి.
బిల్ డెస్క్ ద్వారా చెల్లింపులు..
- ఒకవేళ మీరు బిల్ డెస్క్‌ను ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం స్క్రీన్‌పై నీటి బిల్లు వివరాలు కనిపిస్తాయి.. వాటిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
- చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింట్ అవుట్ తీసుకోండి.
Amazon Pay ద్వారా HMWSSB వాటర్ బిల్ పేమెంట్ చేయడం ఎలా?