తెలంగాణ

telangana

ETV Bharat / state

SRINIVAS GOUD: మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ప్రదానం - Minister Srinivas Goud latest news

ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్​షిప్​ అసోసియేషన్ 28వ వారోత్సవాలు హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.

SRINIVAS GOUD: మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
SRINIVAS GOUD: మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ప్రదానం

By

Published : Sep 19, 2021, 5:22 AM IST

పది మందికి సహాయం చేసేవారు.. మరణించినా సహాయం పొందిన వారి మనసుల్లో ఎప్పటికీ బతికే ఉంటారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్​షిప్​ అసోసియేషన్ 28వ వారోత్సవాలు హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఇండియా, ఇజ్రాయెల్ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు ఈ అసోసియేషన్ చాలా కృషి చేస్తుందని మంత్రి కొనియాడారు. ఇరు దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. కులం, మతం అనేవి మనిషి పుట్టాక ఏర్పడి, చచ్చాక వెళ్లిపోతాయన్న మంత్రి.. సమాజం కోసం చేసే సేవ పది కాలాలు పదిలంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ డాక్టరేట్​ను ప్రదానం చేశారు.

ఇదీ చూడండి: Fire Accident: పెద్ద గోల్కొండ వద్ద కారు దగ్ధం... వ్యక్తి సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details