తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్మాదాతలు ముందుకు రావడం శుభపరిణామం'

కరోనా బాధితుల ప్రాణం కాపాడేందుకు ప్లాస్మా దాతలు ముందుకు రావడం శుభపరిణామం అని అపోలో ఆస్పత్రి ఛైర్​పర్సన్​ సంగీతా రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని ఓ హొటల్​​లో నిర్వహించిన కార్యక్రమంలో 50మంది ప్లాస్మా దాతలను.. తెలంగాణ ప్లాస్మాడోనర్స్​ అసోసియేషన్​​ తరఫున సన్మానించారు.

'ప్లాస్మాదాతలు ముందుకు రావడం శుభపరిణామం'
'ప్లాస్మాదాతలు ముందుకు రావడం శుభపరిణామం'

By

Published : Oct 4, 2020, 10:30 AM IST

కరోనా కష్టకాలంలో బాధితుల ప్రాణం నిలబెట్టేందుకు ప్లాస్మాదాతలు ముందుకు రావడం శుభపరిణామమని అపోలో ఆస్పత్రి ఛైర్​పర్సన్​ సంగీతరెడ్డి అన్నారు. ప్లాస్మాదానం చేసిన 50 మందిని హైదరాబాద్​లోని ఓ హొటల్​లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్లాస్మాడోనర్స్​ అసోసియేషన్​ తరఫున సన్మానించారు.

కొవిడ్​ బాధితుల కోసం ప్లాస్మా అసోసియేషన్​ ఏర్పాటు చేసి.. బాధితుల ప్రాణాలు నిలబెడుతున్న వారికి అభినందనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది నుంచి ప్లాస్మా సేకరించి 1,200 మంది బాధితులకు అందించామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి:కసరత్తు ముమ్మరం: 11 అంశాలతో పాసుపుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details