తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో రోడ్డు ప్రమాదాల నివారణకు టీ20 యాప్​ - home minister mahamood ali news

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందించిన టీ20 యాప్​ను ఆయన ప్రారంభించారు. నెల రోజుల తర్వాత దీన్ని గూగుల్​ ప్లే స్టోర్​లో పొందుపరచనున్నారు.

t20 cup app, hyderabad traffic police t20 app
టీ20 యాప్​

By

Published : Jan 18, 2021, 7:43 PM IST

రహదారి ప్రమాదాల నివారణ కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కేంద్రం నిర్దేశాలకనుగుణంగా రహదారి మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందించిన టీ20 యాప్​ను హోం మంత్రి ప్రారంభించారు.

అవగాహన కల్పించేలా..

రహదారి భద్రత, ట్రాఫిక్ నిమయాలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేలా ఈ అప్లికేషన్​ను రూపొందించారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఈ అప్లికేషన్ ఎంతో ఉపయోగపడుతుందని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం బేగంపేట, గోషామహల్, కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్న ట్రాఫిక్ శిక్షణ కేంద్రాల్లో ఈ యాప్​ను అందుబాటులో ఉంచారు. నెల రోజుల తర్వాత యాప్​ను గూగుల్ ప్లే స్టోర్​లో పొందుపర్చనున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు టీ20 యాప్​.. త్వరలో అందుబాటులోకి

ఇదీ చదవండి:'నాతో చర్చకు వస్తే.. గణాంకాలతో సహా నిరూపిస్తా'

ABOUT THE AUTHOR

...view details