మన రాష్ట్రానికి చెందిన మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లు చాలా తక్కువ మంది ఉన్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మదీనా విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హోంమంత్రి పాల్గొన్నారు. మైనార్టీ వర్గం నుంచి సివిల్స్ చదివే వారి సంఖ్య ఎక్కువగా లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సివిల్స్‌పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అందరూ ఇంజినీర్, డాక్టర్ వృత్తిలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం రాకముందు మైనార్టీల కోసం చాలా తక్కువ విద్యాసంస్థలు ఉండేవని... అధికారంలోకి వచ్చాక 2,400 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు.
"మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల సంఖ్య పెరగాలి" - ias
మైనార్టీ వర్గం నుంచి సివిల్స్ చదివే వారి సంఖ్య ఎక్కువగా లేదని హోంమంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మదీనా విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
హోంమంత్రి మహమూద్ అలీ