కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీలోని మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతి (Amit Shah Tirupati Tour)కి రానున్నారు. సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా తాజ్ హోటల్‌కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాఫ్టర్లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణభారతి ట్రస్టు , ముప్పవరపు ఫౌండేషన్లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు.
Amit Shah Tirupati Tour: నేడు ఏపీకి అమిత్‌షా.. మూడు రోజుల పర్యటన - ఏపీకి అమిత్ షా
మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి (Amit Shah Tirupati Tour) రానున్నారు. సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్టు 20 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్ హోటల్లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40 కు దిల్లీ చేరుకుంటారు.
ఇదీ చదవండి:Harish Rao on Fuel price: '16సార్లు పెంచి... ఒక్కసారి తగ్గించి.. మేలు చేసినట్లు కేంద్రం డ్రామా'