ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఆ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను తీసుకువెళ్లారు. అహోబిలం పీఠాధిపతి ఆదేశాల మేరకు పుట్ట బంగారు మండపం వద్ద ఉన్న మట్టిని, సమీపంలోని భవనాశి నదిలోని పవిత్ర జలాలకు పూజ చేసి తీసుకువెళ్లారు.
అయోధ్యకు అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలు
ఏపీలోని కర్నూలు జిల్లాలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలను అయోధ్యలోని రామ జన్మభూమి వద్దకు తీసుకెళ్తున్నారు.
అయోధ్యకు అహోబిలం నుంచి పవిత్ర మట్టి, జలాలు
శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో అహోబిలానికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు తెలిపారు.
ఇదీ చదవండి:'మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కల్గిస్తోంది'