తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా ఉద్యోగులకు గుడ్​న్యూస్.. 8న సెలవు ప్రకటించిన ప్రభుత్వం - మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీలేని రుణాలు

Holiday for Women employees on Womens Day: మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8న సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Womens Day
Womens Day

By

Published : Mar 6, 2023, 1:40 PM IST

Updated : Mar 6, 2023, 3:01 PM IST

Holiday for Women employees on Womens Day: మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ.. సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సెర్ప్, మెప్మా మహిళలకు ఈ రుణాలు అందిస్తామని చెప్పారు. ఈ నెల 8న రూ.750 కోట్లు రుణాలు విడుదల చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 100 మహిళా ఆస్పత్రులు ప్రారంభమవుతాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముందుగా వంద ఆస్పత్రులు నిర్మించి క్రమంగా ఆస్పత్రులు పెంచుతామని పేర్కొన్నారు. ఆరోగ్య మహిళల పేరుతో ఈ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయన్నారు. ప్రతి మంగళవారం ఆసుపత్రిలో మహిళా సిబ్బందే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి మంత్రి హరీశ్​రావు భూమిపూజ చేశారు.

మార్చి 8న మహిళా వారోత్సవాలు: రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో.. వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించనుంది. పురపాలికలో కీలకపాత్ర వహించి.. వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

ఇందులో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేటీఆర్ వివరించారు. అలాగే డ్రై కంపోస్ట్, కిచెన్ కంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి రంగాల్లో ఆదర్శవంతమైన విధానాలతో ముందుకెళ్తున్న పురపాలక సిబ్బంది, ఆయా పట్టణాలలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆరోజు మహిళల కోసం స్పెషల్ బస్సులు: గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో మహిళా దినోత్సవం రోజున మహిళలు, విద్యార్థినుల కోసం టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. పట్టణ శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినుల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. గ్రేటర్‌ పరిధిలోని 10 రద్దీ రూట్లలో 85 మహిళా స్పెషల్‌ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. మార్చి 8న బుధవారం ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్​ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 6, 2023, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details