HMDA review: హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక దృష్టితో గత మూడు సంవత్సరాల్లో రూ. 2వేల కోట్ల వ్యయంతో బాహ్య వలయ రహదారి లోపల, బయట ఉన్న ప్రాంతాల్లో వ్యూహత్మక అభివృద్ధి పనులు, సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టింది. వాటిలో పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. బాలానగర్ వద్ద 6-లేన్ 2 వే ఫ్లైఓవర్, నర్సాపూర్ x రోడ్డు, ఫతేనగర్ జంక్షన్లను దాటుతూ 1 కిలోమీటరు పొడవునా ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న 30 మీటర్ల వెడల్పు నుంచి 45 మీటర్ల వెడల్పు వరకు ఇరువైపులా సక్రమంగా అభివృద్ధి చెందుతున్న సర్వీస్ రోడ్ల విస్తరణ కూడా ఉంది.
ట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు..
HMDA: గ్రానైట్ ఫ్లోరింగ్‌తో ట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పటికే ఉన్న రైలింగ్‌ను అలంకారమైన రెయిలింగ్‌తో భర్తీ చేసి వీధి దీపాలు, బెంచీలు మొదలైనవి విశ్రాంతి సమయం కోసం వచ్చే సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ఫుట్‌పాత్ మెరుగుదల, వాక్‌వే లైటింగ్ 6 కిలోమీటర్ల పొడవునా... వీడీసీసీ రోడ్డు వేయడం ద్వారా నెక్లెస్ రోడ్డు కూడా మెరుగులు దిద్దింది. నగర శివారు బాటసింగారం వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో కూడిన రెండు లాజిస్టిక్ పార్కులు, 20 ఎకరాల విస్తీర్ణంలో మంగళ్‌పల్లి వద్ద లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్ ఆపరేటర్లకు వేర్ హౌసింగ్, డార్మిటరీలు, పార్కింగ్, స్టేషన్, ఫుడ్ కోర్ట్ , ఇంధనం సక్రమంగా అందించడం కోసం వన్ స్టాప్ సౌకర్యంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఓఆర్ఆర్పై లైటింగ్
Lighting on ORR: హైదరాబాద్ చుట్టూ 136 కిమీ ఓఆర్‌ఆర్ సెంట్రల్ మీడియన్‌పై ఎల్ఈడీ లైట్లతో మెయిన్ క్యారేజ్ వేలో లైటింగ్ ఏర్పాటు చేసింది. రాత్రి సమయంలో ప్రమాదాలు నివారించేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్లతో 15 ఇంటర్ ఛేంజ్‌ల పనులన్నీ పూర్తయ్యాయి. ఆర్‌ఎఫ్‌ఐడీ వ్యవస్థతో టోల్ నిర్వహణలు ఏర్పాటు చేసింది. ఉప్పల్, ఏఎస్ రావు నగర్, ఐడీపీఎల్ కాలనీలో మూడు ఎఫ్ఓబీలు పూర్తయ్యాయి.
రెండు స్కైవాక్‌లు
Hyderabad metropolitan development authority: నగరంలో ఉప్పల్, మెహిదీపట్నంలో రెండు స్కైవాక్‌లు ఎలివేటెడ్ నడక మార్గాల పనులు చురుకుగా సాగుతున్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా జంక్షన్‌లోని ప్రతి వైపు నుంచి పాదచారుల కదలిక కోసం పురోగతిలో ఉన్నాయి. బస్ స్టాప్‌లకు నేరుగా అనుసంధానం చేయబోతున్నారు. ఉప్పర్‌పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఉప్పర్‌పల్లి వద్ద అప్ ర్యాంప్, డౌన్ ర్యాంప్‌లు చేపట్టారు. లక్ష్మీనగర్ వద్ద డౌన్ ర్యాంప్ నిర్మించాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఇది భూమి కొరత కారణంగా పూర్తిగా ఆలస్యమవుతోంది.