తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ

కరోనా మహమ్మారిపై యుద్ధం పూర్తి కాలేదని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొవిడ్​ జనాందోళన్​ సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సబ్బుతో చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు.

కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ
కరోనాపై యుద్ధం పూర్తి కాలేదు: బండారు దత్తాత్రేయ

By

Published : Oct 10, 2020, 6:44 PM IST

కరోనా మహమ్మారిపై యుద్ధం పూర్తి కాలేదని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కొవిడ్‌ జనాందోళన్ సందేశంలో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు సబ్బుతో చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో రెండు గజాల దూరం పాటించి.. బాధ్యతాయుత పౌరుడిగా నియమాలు పాటించాలని బండారు దత్తాత్రేయ కోరారు. కరోనాపై విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారన్నారు. జనాందోళన్​లో భాగస్వామ్యం అయి కరోనా విముక్తికి యువత ముందుకు రావాలని దత్తాత్రేయ కోరారు.

ఇదీ చదవండి:గవర్నర్​గా ప్రజలతో మమేకమయ్యా: దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details