లాక్‌డౌన్ సమయంలోనూ రాష్ట్రంలో మందుబాబులు ఏ మాత్రం తగ్గడం లేదు. దుకాణాలకు సమయం కుదించినా... గిరాకీ మాత్రం తగ్గడంలేదు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా... మే 6న దుకాణాలు తెరవడం వల్ల మందుబాబులు బారులు తీరారు. ఇలా మే 6 నుంచి 31 వరకు.. 26 రోజుల్లో రూ.2,270 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
వంద కోట్లకు మించి విక్రయాలు..
చాలా ఉమ్మడి జిల్లాల్లో రూ.100 కోట్లకు మించి విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.478 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. హైదరాబాద్‌లో రూ.225 కోట్లు, కరీంనగర్ జిల్లాలో రూ.206 కోట్లు, ఖమ్మం రూ.167 కోట్లు.. మహబూబ్‌నగర్ రూ.188 కోట్లు.. మెదక్ రూ.186 కోట్ల విలువైన లిక్కర్‌ను మందు బాబులు తాగేశారు. నల్గొండ జిల్లాలో రూ.251 కోట్లు, నిజామాబాద్ జిల్లాల్లో రూ.121 కోట్లు, వరంగల్ జిల్లాల్లో రూ.195 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. చిన్న జిల్లా అయిన ఆదిలాబాద్‌లోనూ ఏకంగా రూ.137 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.