తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?' - కరోనా పరీక్షల వార్తలు

రాష్ట్రంలో తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నారన్న వాదనపై హై కోర్టు విచారణ ప్రారంభించింది. అందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

highcourt-on-corona-tests-in-telangana
'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'

By

Published : May 14, 2020, 5:36 PM IST

Updated : May 14, 2020, 6:52 PM IST

సూర్యాపేటతో పాటు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపాలన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. సూర్యాపేటకు చెందిన వరుణ్ సంకినేని వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలీస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తున్నారని పిటిషనర్ వాదించారు.

"ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? బలవంతంగా చేస్తే ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. అందరికీ పరీక్షలు చేస్తే పరీక్ష కిట్లు, లేబొరేటరీలు సరిపోతాయా? లాక్​డౌన్​తో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారినప్పటికీ... ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది."

-హైకోర్టు

అనంతరం అడ్వకేట్ జనరల్ వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:పిల్లుల్లోనూ కరోనా వ్యాప్తి.. వాటి నుంచి మనుషులకు?

Last Updated : May 14, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details