తెలంగాణ

telangana

ETV Bharat / state

Pharmacy Land High Court Status Co : ఫార్మాసిటీకి వెయ్యి ఎకరాల భూమిపై.. హైకోర్టు స్టేటస్​ కో - దేవరకొండ మార్కెట్​కు ప్రభుత్వ కాలేజీ భూమి

telangana high court
telangana high court

By

Published : Jun 27, 2023, 8:30 PM IST

Updated : Jun 27, 2023, 10:20 PM IST

20:24 June 27

Pharmacy Land High Court Status Co : ఫార్మాసిటీకి వెయ్యి ఎకరాల భూమిపై.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court Status Co On Giving 1000 Acres Of Devadaya Land To Pharmacy : ఫార్మాసిటీకి 1000 ఎకరాల దేవాలయ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి, సింగారం గ్రామాల్లో ఓంకారేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాలను భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి దేవదాయ భూమి సేకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నలుగురు రైతులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం విచారణ జరిపింది.

దేవదాయ శాఖ భూమిని సేకరించేందుకు ముందస్తుగా హైకోర్టు అనుమతి పొందాలని గతంలో ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్లు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులకు మాత్రమే దేవదాయ శాఖ భూములు ఇవ్వాలని పిటిషనర్ల వాదన. అయితే భూసేకరణ అనుమతి కోసం రెవెన్యూ అధికారులు కాకుండా టీఎస్‌ఐఐసీ అనుమతి కోసం హైకోర్టుకు వచ్చిందన్నారు. విచారణ జరిపిన ధర్మాసం దీనికి సంబంధించిన గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని.. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దేవరకొండ మార్కెట్​కు ప్రభుత్వ కాలేజీ భూమి :నల్గొండ జిల్లా దేవరకొండలో కూరగాయలు, మాంసం మార్కెట్‌కు ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలాన్ని కేటాయించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కోసం ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీకి చెందిన ఎకరం 35 గుంటల భూమిని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే కాలేజీ స్థలం మార్కెట్ కోసం ఇవ్వొద్దని.. దానివల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని ఇంటర్ విద్య కమిషనర్ కూడా వ్యతిరేకించారు. కాలేజీ భూమిని మార్కెట్ కోసం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది టి. రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Telangana High Court On Devarakonda Market Lands : కలెక్టర్ నిర్ణయం సుమారు వెయ్యి మంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది టి.రజనీకాంత్ రెడ్డి వాదించారు. వాదనలు విన్న సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, ఇంటర్ విద్య కమిషనర్‌కు, కాలేజీ ప్రిన్సిపల్‌కు నోటీసులు జారీ చేసంది. ఆగస్టు 18లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Government Lands Allocations in Telangana : కులాల వారీగా భూ కేటాయింపులు చేయడం.. ఆర్టికల్​ 14కు విరుద్ధమేనని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహించింది. ఈ ప్రభుత్వం చేస్తున్న కులాల వారీగా భూ కేటాయింపులు కచ్చితంగా తప్పేనని.. ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. హైటెక్​ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాలు ఏంటని ప్రశ్నించింది. ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తున్న ధోరణి.. కుల విభజనకు దారి తీసేలా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్, జస్టిస్​ ఎన్​. తుకారంతో కూడిన ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్​లోని ఖానామెట్​లో వెలమ, కమ్మ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించడంపై ఈ విచారణ చేపట్టింది.

ఇవీ చదవండి :

Last Updated : Jun 27, 2023, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details