చట్ట విరుద్ధంగా జంతువుల రవాణా, వధ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని చట్ట విరుద్ధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతోందని గోజ్ఞాన్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇటీవల షాద్నగర్లో ఓ వాహనంలో తరలిస్తున్న గోవులను పట్టుకొని పోలీసులకు అప్పగించినప్పటికీ.. కేసు నమోదు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్సింహారావు వాదించారు. చెక్ పోస్టుల వద్ద పోలీసులకు సహకరించేందుకు గో సంరక్షక కార్యకర్తలను అనుమతించాలని కోరారు.
HIGH COURT: 'అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'
జంతువుల అక్రమ రవాణా, వధ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
పిటిషనర్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కేసు నమోదు చేయాలని షాద్నగర్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలని పోలీసులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జంతు సంక్షేమ బోర్డుతో పాటు.. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరి అమలు చేయాల్సిందేనని హోం శాఖ, డీజీపీలను ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో ఆగస్టు 2లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: HIGH COURT: ఆన్లైన్ క్లాసులకు ఫీజులతో ముడిపెట్టొద్దు