గిరిజన ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు హక్కులు కల్పిస్తూ మెరూన్ పాస్ పుస్తకాలను ఈనెల 19 వరకు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఇవాళ విచారణ చేపట్టింది.
అప్పటివరకు పంపిణీ చేయవద్దు: హైకోర్టు
గిరిజన ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు హక్కులు కల్పిస్తూ మెరూన్ పాస్ పుస్తకాలను ఈనెల 19 వరకు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
షెడ్యూలు ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు శాశ్వత హక్కులు కల్పించి మెరూన్ పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పిటిషనర్ సంస్థ పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యంగంలోని ఐదో షెడ్యూలుకు, 1/70 చట్టానికి విరుద్ధమని వాదించారు. పూర్తి వివరాలతో ఈనెల 19 వరకు కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు... అప్పటి వరకు వారికి పాస్ పుస్తకాలు జారీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి:హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం