తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగాల పేరుతో మహిళలు అక్కడ మగ్గిపోతున్నారు' - అక్రమంగా రవాణా చేస్తున్న ఏజెంట్లు

తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ అక్రమంగా రవాణా చేస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకుని... పొరుగుదేశాల్లో మగ్గిపోతున్న మహిళలను రక్షించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు.

high court lawyer files  Women's Trafficking Case In Hrc
'ఉద్యోగాల పేరుతో మహిళలు అక్కడ మగ్గిపోతున్నారు'

By

Published : Jan 29, 2020, 7:41 PM IST

ఉద్యోగాల నెపంతో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలను కువైట్, అరబ్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ హెచ్​ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పలువురు ఏజెంట్లు మహిళలకు మాయమాటలు చెప్పి... ఉద్యోగాల పేరుతో విదేశాల్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్, మహబూబ్​నగర్, కరీంనగర్, ఆదిలాబాద్​కు చెందిన అనేక మంది మహిళలు అరబ్ దేశాల్లో మగ్గుతున్నారని వెల్లడించారు.
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏజెంట్లపై చర్యలు తీసుకొని... అరబ్​ దేశాల్లో ఇబ్బందులకు గురవుతున్న మహిళలను ఇండియాకు రప్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు.

'ఉద్యోగాల పేరుతో మహిళలు అక్కడ మగ్గిపోతున్నారు'

ABOUT THE AUTHOR

...view details