గిరిజనుల పోడుభూములపై హక్కుల క్రమబద్ధీకరణకు రక్షిత అటవీ హక్కుల చట్టం(ROFR) ప్రకారమే దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు(High Court issued interim orders) జారీ చేసింది. అటవీ భూముల్లో సాగు చేస్తున్న వారికి వ్యక్తిగత హక్కులను మాత్రమే క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులు స్వీకరించాలంటూ ఈనెల 2న ములుగు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
ములుగు కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను( pil on mulugu collector orders) సవాల్ చేస్తూ గోవిందరావుపేటకు చెందిన అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆర్ఓఎఫ్ఆర్ ప్రకారం వ్యక్తిగత హక్కులతో పాటు సామాజిక, గ్రామసభలపై హక్కులు కల్పించేలా దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.