రెవెన్యూ , వక్ఫ్‌బోర్డులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వక్ఫ్‌భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. అక్రమణలుంటే తొలగించాలని ఆదేశించింది. వక్ఫ్‌భూముల రక్షణకు తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. 1997 హౌస్ కమిటీ నివేదిక ప్రకారం వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ మహమ్మద్ బాబర్ ఖురేషీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
HIGH COURT: సర్వే నిర్వహించి వక్ఫ్ భూములను గుర్తించాలి: హైకోర్టు - తెలంగాణ వార్తలు
వక్ఫ్ భూముల రక్షణకు తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని రెవెన్యూ, వక్ఫ్‌బోర్డులను హైకోర్టు సూచించింది. రెవెన్యూ , వక్ఫ్‌బోర్డులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వక్ఫ్‌భూములను గుర్తించాలని, ఆక్రమణలుంటే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.
వక్ఫ్‌బోర్డు ఇప్పటికే సర్వే నిర్వహించిందని వక్ఫ్‌బోర్డు తరపు న్యాయవాది అబూ అక్రమ్ వాదనలు వినిపించారు. అయితే తమ భూములను గుర్తించడానికి రెవెన్యూ అధికారుల సాయం అవసరమని తెలిపారు. రంగారెడ్డి కలెక్టర్‌కు 5 సార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. కలెక్టర్ వివరణ తీసుకుని వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. భూములను అక్రమించుకున్నారన్న ఆరోపణలతో ప్రైవేటు ప్రతివాదిగా ఉన్న సియాసత్ ఎడిటర్ జాహెద్ అలిఖాన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సర్వే చేసే అధికారం రెవెన్యూవారికి లేదని, వక్ఫ్‌బోర్డుకు మాత్రమే ఉందని చెప్పారు. పిల్‌పై విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Zonal line clear: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదం