తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్ దర్యాప్తునకు తుషార్ సహకరించాలన్న హైకోర్టు - ఎమ్మెల్యేలకు ఎర కేసు తాాజా వార్తలు

TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సిట్ దర్యాప్తునకు తుషార్ సహకరించాలని హైకోర్టు తెలిపింది. తుషార్​ను మాత్రం అరెస్టు చేసేందుకు వీల్లేదని పేర్కొంది.

TRS MLAs Poaching Case
TRS MLAs Poaching Case

By

Published : Nov 30, 2022, 3:43 PM IST

TRS MLAs Poaching Case Update: కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సిట్ దర్యాప్తునకు తుషార్​ సహకరించాలని న్యాయస్థానం పేర్కొంది. కానీ తుషార్​ను మాత్రం అరెస్టు చేసేందుకు వీల్లేదని తెలిపింది. 41-ఏ నోటీసు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్​ను చేర్చారని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన వాదించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజకీయ అజెండా మేరకే సిట్‌ దర్యాప్తు చేస్తోందని తుషార్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 21న విచారణకు రావాలని 16న 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారన్నారు. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్‌ చేసినట్లు చెప్పారు. అయితే, తన మెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్‌ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని పిటిషన్‌లో తుషార్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details