తెలంగాణ

telangana

ETV Bharat / state

జూబ్లీహిల్స్​ సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ - telangana varthalu

జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో రెండుసార్లకు మించి పోటీ చేయరాదని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది.వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్​ను కొట్టివేసింది.

జూబ్లీహిల్స్​ సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ
జూబ్లీహిల్స్​ సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ

By

Published : Mar 13, 2021, 3:16 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో రెండుసార్లకు మించి పోటీ చేయరాదన్న నిబంధనపై స్పష్టతనిస్తూ రిజిస్ట్రార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ నిలిపివేయాలన్న పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 1న సొసైటీల రిజిస్ట్రార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరుతూ బొల్లినేని రవీంద్రనాథ్ దాఖలు చేసిన పిటిషన్​పై జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ విచారణ జరిపారు. సొసైటీ బైలాస్​లోని 22ఏ నిబంధన ప్రకారం రెండు సార్లకు మించి పోటీ చేయరాదని.. దాన్ని సవరించే అధికారం రిజిస్ట్రార్​కు లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్ రెడ్డి వాదించారు.

రెండుసార్లకు మించి పోటీ చేయవద్దన్న నిబంధన గతంలో ఉండేదని.. 2001లో చట్టం నుంచి దాన్ని ప్రభుత్వం తొలగించిందని రిజిస్ట్రార్ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వివరించారు. అదే విషయంపై స్పష్టతనిస్తూ రిజిస్ట్రార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయినందున న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని కోరారు. ఎన్నికలు నిలిపివేయవద్దని అభ్యంతరాలుంటే తర్వాత ట్రైబ్యునల్​లో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని జూబ్లీహిల్స్ సొసైటీ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు సొసైటీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్​ను కొట్టివేసింది.

ఇదీ చదవండి: కోర్టు ధిక్కరణ కేసులో హయత్‌నగర్ తహసీల్దార్‌కు హైకోర్టు వారంట్

ABOUT THE AUTHOR

...view details