తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు సమ్మతి

ఆసుపత్రి నుంచి డిశ్చార్జికి విశాఖ వైద్యుడు సుధాకర్​కు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఆయన ఎప్పుడైనా వెళ్లొచ్చని సూచించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు సహకరించాలని సూచించింది.

doctor
doctor

By

Published : Jun 5, 2020, 12:28 PM IST

విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు సుధాకర్​ డిశ్చార్జికి హైకోర్టు అనుమతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం... ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్‌కు సూచించింది.

ఇదీ చదవండి

'రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ వెబ్‌సైట్లను నిషేధించాలి'

ABOUT THE AUTHOR

...view details