తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌ను పంజాబ్ - హరియాన హైకోర్టుకు బదిలీ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు బార్ అసోషియేషన్ నిరసించింది. సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్‌కుమార్‌ను జూనియర్ జడ్జిగా హర్యానాకు బదిలీ చేయటాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా తప్పబట్టింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును వెంటనే వెనక్కి తీసుకోవాలని హైకోర్టు బార్ అసోషియేషన్ డిమాండ్ చేసింది. రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించారు. శనివారం వరకు కోర్టు విధులు బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది.
హైకోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ - న్యాయవాదులు
తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌ను పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు బార్ అసోషియేషన్ నిరసించింది.
హైకోర్టులో న్యాయవాదుల విధులు బహిష్కరణ