తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు సీరియస్: 'గాంధీ' లొల్లిపై మంత్రి సమీక్ష - ఈటల రాజేందర్​

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆరోగ్యశ్రీ ట్రస్టులో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో గాంధీ ఆస్పత్రిపై వస్తున్న ఆరోపణలపై చర్చించారు.

eetala rajender
ఈటల రాజేందర్​

By

Published : Feb 15, 2020, 4:56 PM IST

Updated : Feb 15, 2020, 7:46 PM IST

హైదరాబాద్​ ఆరోగ్యశ్రీ ట్రస్టులో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్షించారు. ఈ సమావేశంలో డీహెచ్‌ డా.శ్రీనివాస్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితా రాణా, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

గాంధీ ఆస్పత్రిపై ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిజాలను నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్​కు అప్పగించినట్లు తెలిసింది. ఆస్పత్రిలో జరుగుతున్న పలు విషయాలపై మంత్రి ఈటల మండిపడ్డారు. ఇకపై మెడికల్ ఇంటర్నీలకు లీవ్​లు, అటెండెన్స్​లకు సంబంధించి సూపరిండెంట్​లకు ఎలాంటి ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్​

ఇదీ చూడండి:ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

Last Updated : Feb 15, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details