రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు అధిక ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారి రాజారావు సూచించారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు.
నిప్పులు చిమ్ముతున్న భానుడు.. మరో మూడు రోజులింతే!
తెలంగాణలో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఆదివారం నుంచి మూడు రోజులపాటు అధిక ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ అధికారి రాజారావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కన్నా 6 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి.
నిప్పులు చిమ్ముతున్న భానుడు.. మరో మూడు రోజులింతే!
ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణంకన్నా 6 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ఈ.రాజారాంపల్లిలో 47.2, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:సోమవారం రంజాన్ వేడుకలు.. నెలవంక వల్లే!