తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో నేడు, రేపు వడగాల్పులు - ఉష్టోగ్రత

రాష్ట్రంలో నేడు, రేపు వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తోంది.

రాష్ట్రంలో నేడు, రేపు వడగాల్పులు

By

Published : May 30, 2019, 5:54 AM IST

Updated : May 30, 2019, 7:45 AM IST

రాష్ట్రంలో నేడు, రేపు వడగాల్పులు

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. నేడు, రేపు వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులుతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనలో 47.5, గోధూర్, కోల్వాయి, మెట్​పల్లిలో 47.3, ఆదిలాబాద్ 46.3, హన్మకొండలో 45.8, హైదరాబాద్​లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు పగటిపూట ఎండలో తిరగవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బతో బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మృతిచెందారు.

ఇవీ చూడండి: జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్

Last Updated : May 30, 2019, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details