రాబోయే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నందున... మరో రెండు వారాలపాటు ఈ ప్రభావం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
మబ్బు విడిచిన వరుణుడు... విస్తారంగా జల్లులు
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇన్ని రోజులకు వరుణుడు మబ్బు విడిచాడు. రెండు రోజులుగా ఓ మోస్తారుగా కురుస్తున్న జల్లులతో రైతన్న ముఖంలో సంతోషం నిండింది. దీనికితోడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
HEAVY RAINS IN TWO TELUGU STATES