రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తొలిసారి గణేశ్ మండపాలకు వాతావరణ సూచనలు చేసింది. సోమవారం నుంచి 3 రోజులు వర్షాలు కురుస్తాయని, మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సంచాలకుడు వై.కె. రెడ్డి ఆదివారం సూచించారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో 7.6కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్పై 3.6 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్ర అధికారి రాజారావు తెలిపారు.
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు - రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గణేశ్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తొలిసారి సూచనలు చేసింది.
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు