- సూర్యాపేట: కోదాడ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
- మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షంతో రోడ్లపై వరద నీరు ప్రవాహం
LIVE UPDATES : హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్.. ఐటీ కంపెనీలకు పలు సూచనలు
17:33 July 25
17:15 July 25
హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు 3 విడతల్లో లాగౌట్ చేయాలని సూచన
- వర్షాల దృష్ట్యా ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసు శాఖ సూచన
- హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సూచన
- ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులు 3 విడతల్లో లాగౌట్ చేయాలని సూచన
- ఐకియా-సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మ.3 గం.కు లాగౌట్ చేయాలని సూచన
- ఐకియా-బయోడైవర్సిటీ వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్ చేయాలని సూచన
- ఐకియా-రాయదుర్గం వరకు ఐటీ ఆఫీసుల్లో సా.4.30కు లాగౌట్ చేయాలని సూచన
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్ చేయాలని సూచన
- గచ్చిబౌలిలోని ఐటీ ఆఫీసుల్లో మ.3-సా.6 మధ్య లాగౌట్ చేయాలని సూచన
17:07 July 25
- ములుగు: వెంకటాపురం మం. సీతారాంపురం పెద్దవాగులో వ్యక్తి గల్లంతు
- చేపల వేటకు వెళ్లి వాగు ఉద్ధృతిలో కొట్టుకుపోయిన బొండయ్య
- వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న స్థానికులు
16:31 July 25
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 63.75 టీఎంసీలు
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 26,296 క్యూసెక్కులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,084 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 63.75 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 90 టీఎంసీలు
- కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతున్న 5300 క్యూసెక్కుల వరద
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1400 అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405 అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 11.91 టీఎంసీలు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 17.80 టీఎంసీలు
- వికారాబాద్: బషీరాబాద్‌లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జీవంగి వాగు
- జీవంగి వాగులో సగం మేర మునిగిన మహాలింగేశ్వర స్వామి ఆలయం
16:17 July 25
వరంగల్‌లోని పునరావాస కేంద్రాలో ఉన్న బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే నరేందర్
- వరంగల్‌లో వర్షాలకు నీటమునిగిన పలు కాలనీలు
- వరంగల్: నీటమునిగిన డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, కాశీ కుంట
- నీట మునిగిన కాలనీలను పరిశీలించిన ఎమ్మెల్యే నరేందర్
- పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే నరేందర్
16:01 July 25
కల్యాణి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి.. నీటి విడుదల
- కామారెడ్డి: కల్యాణి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
- కల్యాణి ప్రాజెక్టు నుంచి మంజీరాలోకి నీరు విడుదల
15:31 July 25
మల్లన్న గండి రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తిన అధికారులు
- జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు
- వర్షాలకు గ్రామాల్లో నిండిన చెరువులు, పొంగుతున్న వాగులు
- మల్లన్న గండి రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్ శివలింగయ్య
- మల్లన్న గండి రిజర్వాయర్ 2 గేట్లు ఎత్తిన అధికారులు
- లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
15:13 July 25
భద్రాచలం వద్ద గోదావరిలో 38.5 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద గోదావరిలో 38.5 అడుగుల నీటిమట్టం
14:34 July 25
హనుమకొండలో ఉద్ధృతంగా నేరేడుపల్లి వాగు
- హనుమకొండ: శాయంపేట మండలంలో ఉద్ధృతంగా నేరేడుపల్లి వాగు
- శాయంపేట మండలం పత్తిపాక నేరేడుపల్లి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న నేరేడుపల్లి వాగు..
- పత్తిపాక నుండి నేరేడుపల్లికి నిలిచిపోయిన రాకపోకలు
14:21 July 25
సిద్దిపేట- హనుమకొండ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
- సిద్దిపేట: హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో భారీ వర్షం
- బస్వాపూర్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
- సిద్దిపేట- హనుమకొండ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
14:17 July 25
మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
- ఇవాళ, రేపు, ఎల్లుండి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- రేపు హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం
- రాగల 24గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం
13:25 July 25
ఖమ్మంలో కుండపోత వర్షం
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షం
- ఖమ్మం నగరంలో కుండపోత వర్షం
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- మధ్యాహ్నం ఒంటి గంటకు 38.1 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి
12:45 July 25
- నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు
- నిజామాబాద్: మరుసుకుంట చెరువు తెగి వేల్పూరు జలమయం
- నీట మునిగిన పీఎస్, తహశీల్దార్ కార్యాలయం, రైతు వేదిక, ఐకేపీ కార్యాలయం
- వేల్పూరు నుంచి ఆర్మూరు రహదారిపై భారీగా వరద నీరు
- వరద నీటితో వేల్పూరు, ఆర్మూరు మధ్య నిలిచిన రాకపోకలు
- వేల్పూరు మండలం పచ్చలనడికుడిలో తెగిన గ్రామ చెరువు
- చెరువు తెగిపోవడంతో కోతకుగురైన ఆర్మూర్, భీంగల్ రహదారి
- ఆర్మూర్, భీంగల్ రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
- వేల్పూరు మండలం పడగల్లో తెగిన నవాబ్ చెరువు
- పడగల్ చెరువు తెగడంతో అంక్సాపూర్, పోచంపల్లి గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- వేల్పూరు మండలంలోని 10 గ్రామాల పంట భూముల జలమయం
- జానకంపేట, పచల నడికుడి, వేల్పూరు, లక్కోరా, వెంకటాపూర్, కుక్కునూరు, కోమన్‌పల్లి, అంక్సాపూర్, పడగల్
- వేల్పూరులో 46.3సె.మీ.ల రికార్డు వర్షపాతం నమోదు
- నిజామాబాద్: వరద ప్రభావిత ప్రాంతల్లో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
- వరద ఉద్ధృతికి తెగిపోయిన వేల్పూర్ చెరువును పరిశీలించిన మంత్రి
- నిజామాబాద్ జిల్లాలో వాగులు, చెరువులు, కుంటల పరిస్థితిపై సమీక్ష
- లోతట్టు ప్రాంతప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం : మంత్రి వేముల
- కోతలకు గురైన రహదారులను మట్టితో పుడ్చాలని స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నా : మంత్రి వేముల
12:44 July 25
నిజామాబాద్: పడకల్ పెద్దచెరువు మత్తడి పగులగొట్టిన అధికారులు
- నిజామాబాద్: భారీ వరద వల్ల కృంగిపోయిన చెరువు కట్ట
- నిజామాబాద్: ముందస్తుగా చెరువు మత్తడి పగులగొట్టిన అధికారులు
12:44 July 25
పెద్దపల్లి: రామగుండం పవర్‌హౌస్ వద్ద తెగిన బూడిద చెరువు కట్ట
- పెద్దపల్లి: బూడిద చెరువు కట్ట తెగి ఇళ్లలోకి చేరిన వరద నీరు
- రామగుండం ఎన్టీపీసీ క్రషర్, ఎన్టీపీసీ ఆటోనగర్‌లోని ఇళ్లలోకి వరద నీరు
- వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఆందోళనలో స్థానికులు
12:06 July 25
మహబూబ్‌నగర్ జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు బాలికలు మృతి
- జడ్చర్ల మం. కొండెడు చెందిన స్వాతి(18), అనూష(17) మృతి
- పొలంలో కలుపు తీయడానికి వెళ్తూ తూర్పు వాగులో గల్లంతు
- అర కిలోమీటర్ దాటిన తర్వాత వాగులో మృతదేహాలు లభ్యం
- మృతులు పక్కపక్క ఇళ్లల్లో నివాసముంటున్న అనూష(17), స్వాతి(18)
11:14 July 25
వరంగల్- ఖమ్మం రహదారిపై నిలిచిన రాకపోకలు
- పంతిని చెరువు ఉప్పొంగడంతో రహదారిపై చేరిన నీరు
- ఖమ్మం- వరంగల్ రహదారిపై 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద
- ఖమ్మం నుంచి వరంగల్ వైపు రహదారిలో చిక్కుకున్న లారీ
- ఖమ్మం- వరంగల్ మధ్య ఐదు గంటలుగా నిలిచిన వాహనాలు
10:54 July 25
భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లపై వరద చేరడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ జాం
- మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
- భారీగా ట్రాఫిక్ జాం వల్ల వాహనాదారులకు ఇబ్బందులు
- హైదరాబాద్: రాత్రి కురిసిన వర్షాలకు రహదారిపై చేరిన వరద
10:40 July 25
జంట జలాశయాలకు భారీగా పోటెత్తుతున్న వరద నీరు.. హిమాయత్‌సాగర్ 4 గేట్ల ఎత్తివేత
- జంట జలాశయాల్లోకి పెరుగుతున్న భారీగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో
- హిమాయత్‌సాగర్ జలాశయం 4 గేట్ల ఎత్తివేత
- హిమాయత్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి వెళ్తున్న 2,750 క్యూసెక్కులు
- హిమాయత్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,761.75 అడుగులు
- హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు
- ఉస్మాన్‌సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు
- ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,786.10 అడుగులు
- ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- ఉదయం 10 గం.కు 37.4 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి
10:38 July 25
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడితెరిపి లేని వర్షాలు
- కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కమ్ముకున్న ముసురు
- సిరిసిల్ల: మధ్య, దిగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
- కరీంనగర్: శంకరపట్నం మం. వంకాయగూడెంలో మునిగిన పొలాలు
- జగిత్యాల: మెట్పల్లి మం. రంగారావుపేట కల్వర్టు వద్ద నిలిచిన రాకపోకలు
- సిరిసిల్ల: కోనరావుపేట మం. నిమ్మపల్లి వద్ద కట్టదాటిన మూలవాగు చెరువు
- జాఫర్‌ఖాన్‌పేట, వెన్నంపల్లి రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు
09:59 July 25
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షం
- శంకరపట్నం, వేములవాడ మండలాల్లో కురుస్తున్న వర్షం
- ఓదెల మం. ఉప్పరపల్లి వద్ద రైల్వే ట్రాక్ బేస్ లోపంతో ఆగిన భాగ్యనగర్ రైలు
- సిరిసిల్ల, ముస్తాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- రాయికల్ మండలం ముటపల్లిలో రహదారి పైనుంచి ప్రవహిస్తున్న నీరు
- మహబూబాబాద్: కేసముద్రం మం. అర్పణపల్లి వద్ద వాగు ఉద్ధృతి
- మహబూబాబాద్: వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వాగు
- కేసముద్రం, గూడూరు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు
09:57 July 25
నగరంలో కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు కాలనీలు
- హైదరాబాద్: భారీ వర్షాలకు పలు కాలనీల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
- హైదరాబాద్: నీట మునిగిన సైదాబాద్, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ,
- నీట మునిగిన కోదండరాంనగర్, సరూర్‌నగర్‌లోని కాలనీలు
- గాజులరామారంలో నీట మునిగిన పలు కాలనీలు
- రాత్రి కురిసిన వర్షానికి జలయమంగా మారిన రహదారులు
- బాచుపల్లి నుంచి గండి మైసమ్మ రహదారిపై నిలిచిన వాహనాలు
- రహదారిపై నీరు చేరడంతో వాహనాదారుల ఇబ్బందులు
- మల్లంపేటలోని లోతట్టు ప్రాంతంలో పలు కాలనీలు జలమయం
- లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కూకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లిలో వర్షం
- నిజాంపేట్, హైదర్‌నగర్, మూసాపేట్లో వర్షం
09:09 July 25
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు
- నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు
- వేల్పూరులో భారీగా వరద ప్రవాహంతో చెరువుకు గండి
- వేల్పూరు పీఎస్, ఎమ్మార్వో కార్యాలయం, రైతు వేదికలోకి చేరిన నీళ్లు
- ఆర్మూరు మండలం పీప్రీ- మంతెన మధ్య రోడ్డుపై చేరిన వరద నీరు
- ఆర్మూర్- భీంగల్ మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- పచ్చల నడికూడ- భీంగల్ మధ్య తెగిన చెరువు, నిలిచిన రాకపోకలు
- వేల్పూరులో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 9 బైకులు
- రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు
- వేల్పూరు మరుసూకుంట చెరువు తెగిపోయే ప్రమాదంలో వరద నీరు ప్రవహిస్తుంది
- నిజామాబాద్: భారీ వర్షాలకు నిండుకుండలా రామడుగు ప్రాజెక్ట్
- డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
- మోపాల్, సిరికొండ, ధర్పల్లిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
- సిరికొండలో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న కప్పల వాగు
09:07 July 25
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులలోకి తగ్గిన వరద ప్రవాహం
- నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 14,141 క్యూసెక్కుల ప్రవాహం
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,083.90 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 63.469 టీఎంసీలు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు
- కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తగ్గిన ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5,500 క్యూసెక్కుల ప్రవాహం
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1,400.38 అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405అడుగులు
- నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 11.764 టీఎంసీలు
- నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు
09:05 July 25
కడెం, స్వర్ణ జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
- నిర్మల్: కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు
- కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
- కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 691 అడుగులు
- కడెం జలాశయంలో చేరుతున్న16,417 క్యూసెక్కుల వరద
- కడెం జలాశయం 2 గేట్ల ద్వారా 10,581 క్యూసెక్కులు విడుదల
- నిర్మల్: స్వర్ణ జలాశయంలో చేరుతున్న వరద నీరు
- స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
- స్వర్ణ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,179.8 అడుగులు
- స్వర్ణ జలాశయంలో చేరుతున్న 3,500 క్యూసెక్కుల వరద నీరు
- స్వర్ణ జలాశయం ఒక గేట్ ద్వారా 2,500 క్యూసెక్కుల విడుదల
09:04 July 25
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం
- భారీ వర్షాలతో పలు గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
- వరంగల్: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వర్ధన్నపేట ఆకేరు వాగు
- వర్ధన్నపేట, రాయపర్తి, సంగెంలో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు
- పర్వతగిరి, ఐనవోలులో జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు
- వర్షపు నీటితో జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు, వాగులు
- హనుమకొండ: దామెర మండలంలో వాగుల ఉద్ధృతి, నిలిచిన రాకపోకలు
- తక్కల్లపాడు, ముస్త్యాలపల్లి మధ్య వాగు ఉద్ధృతికి నిలిచిన వాహనాల రాకపోకలు
- మహబూబాబాద్: తొర్రూరు - నర్సంపేట మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- తొర్రూర్ మండలం గుర్తురు పెద్దచెరువు ఉద్ధృతి, నిలిచిన రాకపోకలు
- వరంగల్: అలుగు పోస్తున్న నర్సంపేట మండలం ముగ్ధంపురం చెరువు
- నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
09:03 July 25
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- భూపాలపల్లి: గణపురం మం. చెల్పూరులో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్
- భూపాలపల్లి: 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- భూపాలపల్లి: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- 2,3 ఓపెన్ కాస్ట్‌లోకి చేరిన వరద నీరు, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
08:55 July 25
Rains in Telangana Today : రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
- రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
- ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం
- రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం
- వర్షం సమయంలో చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాల కింద నిలబడకూడదని సూచన
- ఉరుముల, మెరుపుల వర్షం కురిసే సమయంలో ఫోన్లు మాట్లాడవద్ధని హెచ్చరిక
- ఫోన్ మాట్లాడితే పిడుగుపాటుకు గురయ్యే అవకాశమన్న వాతావరణశాఖ