తెలంగాణ

telangana

ETV Bharat / state

పురానాపూల్‌ని ముంచెత్తిన వరదలు.. రాగల మూడురోజులు భారీవర్షాలు! - floods in Puranapool

గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు పురానాపూల్‌ని వరదలు ముంచెత్తాయి. భారీగా వరదనీరు చేరడంతో రెండు ఆలయాలు జలదిగ్బంధమయ్యాయి. ఆహర కొరతతో పురానాపూల్‌, జియాగూడ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

heavy floods in Puranapool
heavy floods in Puranapool

By

Published : Jul 27, 2022, 3:43 PM IST

Updated : Jul 27, 2022, 4:11 PM IST

హైదరాబాద్‌లో మంగళవారం చాలాచోట్ల.. కుండపోతగా వాన కురిసింది. చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. నగరంలోని పురానాపూల్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా వరద నీరు చేరడంతో ఈ ప్రాంతంలోని రెండు ఆలయాలు జలదిగ్బంధం అయ్యాయి. కాలనీల్లోకి మోకాలు లోతుకు పైగా నీరు రావడంతో ఇండ్లలోకి వరదనీరు చేరింది.

రహదారులన్ని జలమయం అవ్వడంతో సామగ్రితో ఉన్న లారీ అందులో చిక్కుకుంది. దీంతో పురానాపూల్‌, జియాగూడ కాలనీవాసుల ఆహారం తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పురానాపూల్‌ని ముంచెత్తిన వరదలు

ఎందుకీ వానలు..రాజస్థాన్‌ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు చాలా చోట్ల... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 27, 2022, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details