తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. శనివారం శ్రీవారిని 91,583 మంది భక్తులు దర్శించుకోగా.. 40,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.23 కోట్లుగా నమోదైంది. మరోవైపు.. తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున రూ1.11 కోట్లు విరాళం అందింది. అన్నదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని సంస్థ ప్రతినిధి ప్రసాద్ అందించారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం - heavy crowd
వారాంతం నేపథ్యంలో.. తిరుమలకు భక్తజన తాకిడి పెరిగింది. స్వామివారి సాధారణ సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ