తెలంగాణ

telangana

ETV Bharat / state

vijayawada railway station: విజయవాడ రైల్వే స్టేషన్లో తగ్గనున్న రైళ్ల నిరీక్షణ సమయం - ap news

దక్షిణ మధ్య రైల్వే భారీ ఎత్తున మార్పులు చేపట్టింది. విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో 32 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ (ఈఐ)తో నూతన బల్బ్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేసింది. దీని ద్వారా సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చని అధికారులు తెలిపారు.

vijayawada railway station
vijayawada railway station

By

Published : Jul 12, 2021, 1:31 AM IST

విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో దక్షిణ మధ్య రైల్వే భారీ ఎత్తున మార్పులు చేపట్టింది. ఈ మార్పులతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గడంతోపాటు సెక్షనల్‌ సామర్థ్యం మెరుగవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. దీనివల్ల ప్రధానంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాకపోకలకు సౌలభ్యం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మార్గంలో ఒకేసారి రైళ్ల రాకపోకలు సాగించినప్పుడు రైళ్లు నిరీక్షించాల్సి వచ్చేది. దీని ప్రభావం ఇతర మార్గాల్లో వచ్చే రైళ్లపైనా పడేది. ఈ సమస్యలను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడలోని ఉత్తర భాగం యార్డులో మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా 32 రూట్లతో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (ఈఐ)తో నూతన బల్బ్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. 1.5 కి.మీ నూతన లైన్‌తో 20 రూట్లతో అనుసంధానించింది.

ప్రయోజనాలు

ప్రధానంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకల నిర్వహణలో క్రాసింగ్‌లను చాలా వరకు నివారించవచ్చు. ఏకకాలంలో రైళ్ల రవాణా సాధ్యమవుతుంది. ముఖ్యంగా.. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం, విజయవాడ - విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో రైళ్ల నిరీక్షణను అధిగమించవచ్చని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:గ్రామరాజ్యం లేని రామరాజ్యం అసంపూర్ణమే..: వెంకయ్యనాయుడు

ABOUT THE AUTHOR

...view details