హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో జరుగుతున్న ఈ శస్త్రచికిత్సలో అమర్చే గుండెను హైదరాబాద్ మెట్రోలో తరలించనున్నారు.
కాసేపట్లో హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు - Hyderabad metro news
రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుని గుండెను.. గుండె సమస్యతో డెత్బెడ్పై ఉన్న ఓ హీరో కూతురికి అమర్చడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ఆ గుండెను హైదరాబాద్ నుంచి కోదాడకు 90 నిమిషాల్లో చేర్చే కథతో వచ్చిన ట్రాఫిక్ సినిమా. ఈ రీల్ సీన్.. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్‌గా జరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ రైతు గుండెను తొలిసారి హైదరాబాద్ మెట్రో ద్వారా ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్‌డెడ్ అయి ఆస్పత్రిలో ఉన్నాడు. అతని గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకు వచ్చింది. ఈ గుండెను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించేందుకు వైద్యులు మెట్రో అధికారులను సాయమడిగారు.
స్పందించిన హైదరాబాద్ మెట్రో అధికారులు.. గుండె తరలింపునకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ మెట్రో ద్వారా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండె తరలించేందుకు సర్వం సన్నద్ధమయింది. నాగోల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వరకు మెట్రో రైలుకు గ్రీన్ ఛానెల్ అమలు చేశారు. ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవడానికే మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు.
- ఇదీ చూడండి :దేశంలో కొత్తగా 8,635 కరోనా కేసులు