రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు ఇలాగే కట్టడి చేస్తే తెలంగాణ నుంచి కరోనాను తరిమేయొచ్చని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా బతుకమ్మ, దసరా పండుగను ఇంటివద్దనే చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ లో మార్పులు చేస్తున్నామని తెలిపారు.
బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల
కరోనా వ్యాప్తి దృష్ట్యా బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఇంటివద్దే చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. పండుగల పేరుతో ఎక్కువ మంది ఒకచోట చేరితే కొవిడ్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు.
బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: ఈటల
అన్ని ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు మొదలయ్యాయని... త్వరలోనే గాంధీలోను వైద్యసేవలు ప్రారంభిస్తామంటున్న మంత్రి ఈటల రాజేందర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి:వీఆర్వోను అన్నమాట వాస్తవమే... అలా ఎందుకన్నానంటే: ఎమ్మెల్యే వివేకానంద