రైతు రుణమాఫీని సక్రమంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అంటూ శాసమండలిలో స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ సరిగ్గా అమలు కావట్లేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయని వాపోయారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవదంటూ... ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చురకలంటించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇతర ప్రభుత్వాలు కొబ్బరికాయలు మాత్రమే కొట్టాయని ఎద్దేవా చేశారు. తెరాస ప్రభుత్వం వాటిని పూర్తి చేసిందంటూ వ్యాఖ్యానించారు.
అబద్ధాన్ని పదే పదే చెబితే.. నిజమవదు: హరీశ్ - financial minister
" రాహుల్‌గాంధీ ప్రచారానికి వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కనెలలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు నమ్మలేదు." - మండలిలో మంత్రి హరీశ్‌రావు
మండలిలో హరీశ్‌రావు