Rahul Gandhi speech at Khammam Congress meeting : అవినీతికి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ మారిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. సోమాజీగూడలోని ఓ హోటల్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం.. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు.
బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీం కాదని అన్నారు. తమ పార్టీ పేద ప్రజలకు ఏ టీం.. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం అని స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని.. బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్ పుట్టిందని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ. 80 వేల 321.57 కోట్లు అయితే.. అవినీతి రూ.లక్ష కోట్లు అని అనడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
- Rahul Gandhi Khammam Meeting Speech : 'బీఆర్‌ఎస్ అంటే బీజేపీ బంధుత్వ పార్టీ.. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతుల్లో ఉంది'
- Rahul Gandhi Speech at Khammam Meeting : 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు రూ.4000 పింఛన్'
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ చేస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా ఏం ఇస్తుందని ధ్వజమెత్తారు. అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అని విమర్శించారు. 'ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్‌తో రాహుల్ ప్రసంగం' అని ఎద్దేవా చేశారు.