ప్రభుత్వ బీసీ వసతి గృహాలను మన్సూరాబాద్‌లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హోం మంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని... కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
మన్సూరాబాద్‌లో బీసీ వసతి గృహాలు ప్రారంభం - home minister mahommed ali
కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్లోని మన్సూరాబాద్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ బీసీ వసతి గృహాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
బీసీ వసతి గృహాలు ప్రారంభం