New Year Guidelines: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఒమిక్రాన్ నేపథ్యంలో నయాసాల్ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని నిన్న ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా... నూతన సంవత్సర వేడుకలను నియంత్రించాలన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇటీవల కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్‌మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం పట్టించుకోలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇవాళ సీజే ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సీపీ మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు.
న్యూ ఇయర్ వేడుకలకు మార్గదర్శకాలివే...
* వేడుకల్లో మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా.
* రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి.