గ్రూప్- 4 పరీక్ష తేదీ ప్రకటించిన TSPSC.. ఎప్పుడంటే? - జులై 1న గ్రూప్ 4 పరీక్ష
14:49 February 02
గ్రూప్- 4 పరీక్ష తేదీ ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ
TSPSC announced Group-4 Exam Date: లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష తేదీ వచ్చేసింది. గ్రూప్-4 పరీక్షకు టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1; మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో భర్తీచేసే 8,180 గ్రూప్- 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వగా.. భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆఖరి గడువును ఫిబ్రవరి 3వరకు పొడిగిస్తూ ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30 వరకు 8,47,277 మంది అప్లై చేసుకోగా.. దరఖాస్తు గడువు పెంచడంతో ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: