స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం మరువలేమని వ్యాన్ డ్రైవర్లు పేర్కొన్నారు. లాక్డౌన్ ఉపసంహరించినా కరోనా విజృంభించిన నేపథ్యంలో విద్యాసంస్థల వ్యాన్ డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారింది. ఈ పరిస్థితుల్లో టెక్కీ రైడ్, సేవాధాన్ సంస్థలు సంయుక్తంగా వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చాయి. హైదరాబాద్ అడిక్‌మెట్‌లో సేవాధాన్ సంస్థ ప్రతినిధి కాసారం స్రవంతి నిత్యావసర సరకులను పాఠశాల వ్యాన్ డ్రైవర్లకు అందజేశారు.
ప్రైవేట్ పాఠశాలల వ్యాన్ డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ - techi ride
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల వ్యాన్ డ్రైవర్ల జీవన దుర్భరంగా మారిందని సేవాధాన్ సంస్థ అధికార ప్రతినిధి కాసారం స్రవంతి అన్నారు. హైదరాబాద్ అడిక్‌మెట్‌లో వ్యాన్ డ్రైవర్లకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వ్యాన్ డ్రైవర్లకు సరకుల పంపిణీ
ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యాన్ డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. వారి ఇబ్బందులను గమనించి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను అందజేసినట్లు వివరించారు.
ఇవీ చూడండి: అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు కరోనా నిర్ధరణ