మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలోని తెరాస కార్యకర్తలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస గోషామహల్ నియోజకవర్గ ఇంఛార్జి నంద కిషోర్ బిలాల్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి వల్ల పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల కోసం.. లాక్డౌన్ సమయంలో 62రోజుల పాటు ప్రతిరోజు నిత్యావసర సరుకులు పంచినట్టు ఆయన తెలిపారు.
తెరాస కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ - హైదరాబాద్ వార్తలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలోని తెరాస కార్యకర్తలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వల్ల పని లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు తమవంతు సాయంగా నిత్యావసరాలు పంచుతున్నట్టు ట్రస్టు ఛైర్మన్, తెరాస నేత నందకిషోర్ బిలాల్ తెలిపారు.
తెరాస కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ
మంగళ్ హాట్ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్తో కలిసి ఆయన బేగంబజార్లో ఐదు వందల మంది తెరాస కార్యకర్తలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఏ పేదవాడు ఆకలితో అలమటించొద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు.. తమ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంచినట్టు నందకిషోర్ బిలాల్ తెలిపారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు