గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హడావిడి మొదలైంది. చంపాపేట డివిజన్లో రాజకీయ నాయకులు ఎవరికి వారు తమ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉండటం వల్ల నేతలు తమ డివిజన్లోని వివిధ కాలనీలను సందర్శిస్తూ స్థానిక నాయకులను కలుసుకొని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వంగ మధుసూదన్‌రెడ్డి ప్రచారం.. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల జోరు - greater hyderabad
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నగరంలో రాజకీయ నాయకులు ఎవరికి వారు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. వివిధ కాలనీలను సందర్శిస్తూ స్థానిక నాయకులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. చంపాపేట డివిజన్లోని పలు కాలనీల్లో భాజపా నేత వంగ మధుసూదన్‌రెడ్డి పర్యటించారు.
మొదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి... కాలనీల్లో నేతల పర్యటన
వివిధ కాలనీల్లో పర్యటిస్తూ అక్కడి స్థానిక సమస్యల్ని తెలుసుకుంటూ పరిష్కరిస్తామని.. ఈసారి తమకు అవకాశం కల్పించాలంటూ వేడుకుంటున్నారు. ఆదివారం చంపాపేట డివిజన్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్న వంగ మధుసూదన్ రెడ్డి పలు కాలనీల్లో పర్యటించారు. స్థానికులను కలిసి ఈ ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు.
ఇవీ చూడండి: బండి నడిచేదెప్పడు.. బతుకు పోరులో గెలిచేదెప్పుడు..?