Greater Hyderabad Metropolitan Municipality Commissioners Transfer :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(congress Government) కొలువు దీరాక అధికారుల బదిలీలపై ప్రధానంగా దృష్టి సారించింది. అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులను బదిలీ చేస్తూ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీపై(GHMC) కూడా దృష్టి సారించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్ పల్లి జోనల్ కమిషనర్‌గా ఉన్న వి. మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న మమత 2010 నుంచి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా 2010 నుంచి 2018 వరకు పనిచేశారు.
జీహెచ్ఎంసీలో నిధుల కొరత - బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసిన గుత్తేదారులు
Transfer Orders IssuedCommissioners : 2018 నుంచి కూకట్ పల్లి జోనల్ కమిషర్‌గా కొనసాగుతున్నారు. మమత కొనసాగింపుపై తరచు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమెపై బదిలీ వేటు పడింది. మమత స్థానంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్‌గా ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని నియమించింది. అభిలాష అభినవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ పై ఉన్న ఆయనను చేనేత, జౌళి శాఖ అదనపు డైరెక్టర్ గా యథాస్థానంలో కొనసాగాలని ఆదేశిస్తూ డిప్యూటేషన్ ను రద్దు చేసింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కూడా ఐఏఎస్ అధికారిని జోనల్ కమిషనర్ గా నియమించింది.