తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంచక్కా ద్రాక్ష పండ్లు కోసుకొని తింటూ కొనుగోలు చేశారు'

Grapes Mela in Hyderabad: శాస్త్రీయ పద్ధతుల్లో పండించిన ఏ పంటకైనా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. వినియోగదారులను కూడా ఇట్టే ఆకర్షిస్తుంది. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన స్థానం క్షేత్రంలో జరిగిన 'ద్రాక్ష పండ్ల' మేళా కోలాహలంగా సాగింది. నగరం, శివార్ల నుంచి విచ్చేసిన ప్రకృతి ప్రేమికులతో ద్రాక్ష క్షేత్రం సందడిగా మారింది. వినియోగదారులు స్వయంగా క్షేత్రం అంతా కలియ తిరుగుతూ.. చెట్ల నుంచి ద్రాక్ష పండ్లను కోసుకుని రుచి చూస్తూ కొనుగోలు చేశారు.

Hyderabad
Hyderabad

By

Published : Mar 12, 2023, 7:59 PM IST

ఆకట్టుకున్న ద్రాక్ష పండ్ల మేళా.. ఎంచక్కా కోసుకుని తింటూ కొనుగోలు చేసే అవకాశం

Grapes Mela in Hyderabad: ద్రాక్ష.. బహుళ పోషక విలువలు గల విశిష్ట పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. నాణ్యమైన తాజా ద్రాక్ష పండ్ల కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం క్షేత్రంలో సందర్శకులు పోటీపడ్డారు. ఉత్సాహపూరిత వాతావరణం నడుమ రెండ్రోజులపాటు జరిగిన ద్రాక్ష మేళా ముగిసింది. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య చిన్నారులు, మహిళలు, పెద్దలు క్షేత్రంలో కలియ తిరుగుతూ.. రుచి చూసి ద్రాక్ష పండ్లను కొనుగోలు చేశారు.

దూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ద్రాక్ష పండ్ల రుచులు ఆస్వాదిస్తూ కిలో రూ.300 నుంచి రూ.500 చొప్పున కొనుగోలు చేశారు. ఉరుకుల పరుగుల జీవితాల నడుమ పల్లెల్లోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ఓ సదవకాశంగా సందర్శకులు భావించారు. 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 7.7 ఎకరాల్లో ద్రాక్ష రకాలు, సాగు, ఉత్పాదకత పెంపుపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.

ప్రయోగాత్మకంగా 60 రకాల ద్రాక్ష పండ్ల సాగు: ఆరోగ్యపరంగా అత్యంత దోహదపడే 60 రకాల ద్రాక్ష పండ్లు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కేవలం 5 ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట.. కోతకు సిద్ధం కావడంతో వేలం వేసిన వర్సిటీ యాజమాన్యం.. ప్రైవేట్ గుత్తేదారుకు అప్పగించింది. రుచికర ద్రాక్ష పండ్లకు డిమాండ్ కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి ఏడాది ఈ తరహాలో మేళాలు నిర్వహిస్తుంటారు.

ద్రాక్ష మేళాకు అనూహ్య స్పందన:ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు ఉన్న దృష్ట్యా.. రక్తహీనత, బీపీ, మధుమేహగ్రస్తులే కాకుండా అన్ని వయస్సుల వ్యక్తులు ద్రాక్ష పండ్లు నిరభ్యతరంగా తినవచ్చని నిర్వాహకులు చెప్పారు. ఈ ద్రాక్ష మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. పెద్దఎత్తున కుటుంబాలు కార్లలో తరలి రావడంతో రెండు రోజుల్లో మొత్తం పండ్లు అమ్ముడుపోయాయి.

"ద్రాక్ష పండ్ల మేళా చాలా బాగుంది. రకరకాల ద్రాక్ష పండ్లు ఉన్నాయి. రుచి కూడా చాలా బాగున్నాయి. వీటిని అర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు. చిన్నపిల్లతో కలిసి వచ్చాం. వారు కూడా నచ్చిన పండ్లను రుచి చూస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఎప్పుడూ రోడ్ల మీద వీటిని కొనుగోలు చేసేవాళ్లం. ఇలా క్షేత్రంలో తిరుగుతూ మంచి అనుభూతిని పొందుతున్నాం." - కొనుగోలుదారులు

"ప్రజల నుంచి ద్రాక్ష మేళాకు అనుహ్య స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున్న ద్రాక్ష పండ్లను కొనుగోలు చేశారు. రెండు రోజుల్లో మొత్తం పండ్లు అమ్ముడుపోయాయి. ఇంకా ఈ మేళాను రెండు, మూడు రోజులు పొడిగించాలని అనుకుంటున్నాం. మా దగ్గర విదేశీ రకానికి సంబంధించిన పండ్లు అందుబాటులో ఉన్నాయి. పదివేల కేజీల వరకు అమ్మాము." -కార్తీక్, గుత్తేదారు

ఇవీ చదవండి:సీఎం కేసీఆర్‌కు అల్సర్... ఏఐజీ ఆస్పత్రి వైద్యపరీక్షల్లో వెల్లడి

కాంగ్రెస్​ నా సమాధి కడుతోంది.. నేను దేశ నిర్మాణం చేస్తున్నా: మోదీ

ABOUT THE AUTHOR

...view details