తెలంగాణ

telangana

ETV Bharat / state

పండగలా....ఎన్టీఆర్​ మోడల్​ స్కూల్​ వార్షికోత్సవాలు - GANDIPET

కోలాహలంగా వార్షికోత్సవ వేడుకలతో ఎన్టీఆర్​ మోడల్​ స్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు కుంటుంబ సమేతంగా విచ్చేసి విద్యార్థులను ఉత్సహపరిచారు.

కన్నుల పండువగా వార్షికోత్సవాలు

By

Published : Feb 3, 2019, 12:26 AM IST

హైదరాబాద్‌ గండీపేటలోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. పేద పిల్లల సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది ఎన్టీఆరేనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని... విద్యార్థులే టీచర్లకు చెప్పే పరిస్థితికి వచ్చామని అన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పురోగతి సాధించాలని లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు సూచించారు.
ఏపీ సీఎం చంద్రబాబు జీవితం యువతకు ఆదర్శప్రాయమైనదని ఎన్టీఆర్‌ మోడల్ స్కూల్‌ మేనేజింగ్​ ట్రస్టీ భువనేశ్వరీ అన్నారు. విద్యార్థులంతా చంద్రబాబులా కష్టపడి చదివి సమాజామార్పుకు దోహదపడాలని సూచించారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బహుమతులిచ్చి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా బాబు కుటుంబ సభ్యులు కాసేపు విద్యార్థులతో మమేకమయ్యారు. కార్యక్రమంలో బాబు మనవడు దేవాన్ష్​ ప్రత్యేక ఆకర్షనగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details